Arya Rajendran: 21 ఏళ్లకే తిరువనంతపురం మేయర్ బాధ్యతలు... రికార్డు సృష్టించిన ఆర్యా రాజేంద్రన్

  • ముగిసిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికలు
  • లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ విజయం
  • మేయర్ అభ్యర్థిగా ఆర్యా రాజేంద్రన్
  • ప్రతిపాదించిన సీఎం పినరయి విజయన్
Arya Rajendran elected as Tiruavananthapuram mayor youngest in the country

కేరళలో ఇప్పుడు ఆర్యా రాజేంద్రన్ అనే యువతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురం నగర మేయర్ గా ఎన్నికైంది. లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ మేయర్ అభ్యర్థిగా ఆమె పేరును సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని సీపీఐ(ఎం) పార్టీ ప్రతిపాదించింది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నిక కార్యక్రమంలో ఆర్యా రాజేంద్రన్ కే మొగ్గు లభించింది.

ఇంతజేసీ ఆర్యా రాజేంద్రన్ వయసు 21 సంవత్సరాలే. ప్రస్తుతం ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ సెకండియర్ చదువుతోంది. ఆమె స్థానిక ఎన్నికల్లో ముదవన్ ముగల్ వార్డు నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థిపై 549 ఓట్ల తేడాతో గెలిచింది. ఎస్ఎఫ్ఐలో క్రియాశీలక సభ్యురాలైన ఆర్యా రాజేంద్రన్ కు రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉంది. దేశంలో ఇంత చిన్న వయసులో ఓ నగర మేయర్ గా ఎన్నికైన వారు గతలో మరెవరూ లేరు.

More Telugu News