KCR: కేసీఆర్ మేకవన్నె పులిలా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

KCR has no right to continue as CM says Jeevan Reddy
  • కొత్త వ్యవసాయ చట్టాలను కేసీఆర్ సమర్థిస్తున్నారు
  • కేసీఆర్ ముసుగు తొలగిపోయింది
  • రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సాగునీరు పేరుతో తెలంగాణను కేసీఆర్ అప్పుల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను కేసీఆర్ సమర్థిస్తున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిజస్వరూపం ఇప్పుడు బయటపడుతోందని అన్నారు.

 కేసీఆర్ ముసుగు తొలగిపోయిందని చెప్పారు. మేకవన్నె పులిలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వేల కోట్ల రూపాయలను దోచుకోవడానికి రాష్ట్రాన్ని ప్రధాని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలతో కేసీఆర్ కుదుర్చుకున్న ఒప్పందం ఇదేనని చెప్పారు. ముఖ్యమంత్రిగా కొనసాగే నైతికహక్కు కూడా కేసీఆర్ కు లేదని అన్నారు.
KCR
TRS
Jeevan Reddy
Congress
Narendra Modi
bjp

More Telugu News