Puvvada Ajay Kumar: కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ... విధులకు హాజరు

Telngana minister Puvvada Ajay Kumar recovered from covid
  • ఇటీవల కరోనా బారినపడిన పువ్వాడ
  • ఆర్టీ-పీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్
  • గత రెండు వారాలుగా హోం ఐసోలేషన్
  • ఇవాళ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చానని వెల్లడి
తెలంగాణ రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఆర్టీ-పీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత రెండు వారాలుగా ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్టు మంత్రి పువ్వాడ వెల్లడించారు. కొవిడ్ కారణంగా 14 రోజుల విరామం తీసుకున్నానని వివరించారు. ఇవాళే విధులకు హాజరయ్యానని, ఖైరతాబాద్ రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో పలు ఫైళ్లపై సంతకాలు చేశానని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, కరోనా నుంచి కోలుకున్న మంత్రికి రవాణా శాఖ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Puvvada Ajay Kumar
Corona Virus
Negative
RTA
RTC
TRS
Telangana

More Telugu News