jagga reddy: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పుడు కేసీఆర్ మళ్లీ ఎందుకు సమర్థిస్తున్నారు?: జగ్గారెడ్డి

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యలు
  • బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నారు
  • ఇప్పుడు రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్లట్లేదు
  • ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఎందుకు అంటున్నారు?
jagga reddy fires on kct

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు జరుపుతోన్న పోరాటానికి మద్దతు తెలిపిన కేసీఆర్ యూటర్న్ తీసుకుని మళ్లీ వాటిని సమర్థిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానని కేసీఆర్ ప్రకటించి, ఇప్పుడు రైతుల దీక్ష వద్దకు ఎందుకు వెళ్లట్లేదని నిలదీశారు.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ బీజేపీ నేతలతో ఏయే ఒప్పందాలు చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు భారాన్ని భరించబోమని ఆయన ఎందుకు అంటున్నారని నిలదీశారు. రైతులకు నష్టం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన చెప్పారు.

తమ పార్టీ రైతులకు మద్దతు తెలుపుతుందని, వారిని కాపాడుకుంటుందని చెప్పారు. కాగా, తెలంగాణలో తమ సర్కారు తరఫున పంటల కొనుగోలు కేంద్రాలు ఉండవని కేసీఆర్ నిన్న స్పష్టం చేశారు. పంటల ఉత్పత్తులను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు చెబుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అన్నారు.

More Telugu News