Somu Veerraju: అర్ధరాత్రి ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు వైఖరి పట్ల కూడా ప్రజలలో గందరగోళంగానే ఉంది: బుచ్చయ్య చౌదరికి సోము వీర్రాజు కౌంటర్

somu veerraju slams tdp
  • హోదా ఇచ్చే పరిస్థితి లేదని సోము వీర్రాజు అంటున్నారు
  • ఇది వైసీపీ వారి మాట లేక బీజేపీ అధ్యక్షుడి మాట: గోరంట్ల 
  • నిధుల్ని ఏ రకంగా పంపకాలు చేసుకున్నారో ప్రజలు గ్రహించారు  
  • నేటి మీ టీడీపీ దుస్థితికి అదే కారణమన్న వీర్రాజు  
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారని పేర్కొంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్చ చౌదరి ట్వీట్ చేశారు. ‘ఇది వైసీపీ వారి మాట లేక బీజేపీ అధ్యక్షుడు మాట అనేది ప్రజలలో గందరగోళం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు మీరు ఇది విన్నారు అనే అనుకుంటున్నాం’ అని గోరంట్ల ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు.

‘ప్రత్యేక హోదా అవసరం లేదంటూ అర్ధరాత్రి ప్యాకేజీకి ఒప్పుకున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడి  వైఖరి పట్ల కూడా ప్రజలలో గందరగోళంగానే ఉంది. నాడు ప్యాకేజీ ద్వారా నిధులిస్తే, వాటిని ఏ రకంగా పంపకాలు చేసుకున్నారో కూడా ప్రజలు గ్రహించారు. అందుకు ఫలితమే నేటి మీ టీడీపీ దుస్థితికి కారణం అని మీకు తెలుసు’ అని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.
Somu Veerraju
BJP
Telugudesam

More Telugu News