Rajinikanth: రజనీకాంత్‌కు బొట్టు పెట్టి.. ఇంట్లోకి ఆహ్వానించిన భార్య

rajinikanth  is back in Chennai
  • నిన్న హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ 
  • బేగంపేట నుంచి చెన్నై వెళ్లిన రజనీ
  • ఈ నెల 31న పార్టీ ప్రకటన  
సినీనటుడు ర‌జ‌నీకాంత్  హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. నిన్న హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి చెన్నై బయలుదేరిన రజనీ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌కు ఆయన భార్య లత బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం రజనీకాంత్  ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయన ఈ నెల 31న పార్టీ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
  
  ఇటీవలే ఆర్‌ఎంఎం (రజనీ మక్కల్ మండ్రం) సభ్యులతో చర్చించిన రజనీ కాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెడతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొత్త ఏడాది కొత్త పార్టీతో క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రానున్నారు.  
Rajinikanth
chennai
Tamilnadu

More Telugu News