Moon Eclipse: వచ్చే ఏడాది నాలుగు గ్రహణాలు.. డిసెంబరులో సంపూర్ణ సూర్యగ్రహణం!

  • రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్యగ్రహణాలు
  • భారత్‌లో కనపడని సంపూర్ణ సూర్యగ్రహణం
  • మే 26న తొలి చంద్ర గ్రహణం
4 Eclipses in next year

వచ్చే ఏడాది  నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. ఇందులో రెండు చంద్రగ్రహణాలు కాగా, రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి. అందులోనూ చెరొక్కటి పాక్షిక గ్రహణాలే. వీటిలో రెండు మాత్రమే మన దేశంలో కనిపిస్తాయని మధ్యప్రదేశ్‌లోని జివాజీ అబ్జర్వేటరీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రకాశ్ గుప్తా తెలిపారు. తొలి గ్రహణం వచ్చే ఏడాది మే 26న ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం. దీనిని పశ్చిమ బెంగాల్, సిక్కిం కాకుండా ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా ప్రజలు వీక్షించవచ్చు.

ఆ తర్వాతి నెలలో అంటే జూన్ 10న వలయాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్‌లో కనిపించదు. నవంబరు 19న పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుండగా, ఇది అరుణాచల్ ప్రదేశ్, అసోంలోని కొన్ని ప్రాంతాల ప్రజలకే కనిపిస్తుంది. డిసెంబరు 4న సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అయితే, ఇది భారత్‌లో కనిపించదు.

More Telugu News