Gopichand: 'పక్కా కమర్షియల్' అంటున్న గోపీచంద్!

Gopichand movie title is Pakka Commercial
  • గోపీచంద్ హీరోగా మారుతి చిత్రం 
  • గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాణం
  • 'పక్కా కమర్షియల్' టైటిల్ పరిశీలన  
సినిమాకి కథ తయారుచేసుకోవడం ఒకెత్తు అయితే, దానికి మంచి ఆకర్షణీయమైన టైటిల్ నిర్ణయించడం అన్నది మరొకెత్తు అన్నది దర్శక నిర్మాతల అభిప్రాయం. ఒక సినిమాకి టైటిల్ పెట్టాలంటే ఎంతో కసరత్తు చేస్తుంటారు. కథకు సూటవ్వాలి.. హీరో ఇమేజ్ కి తగినట్టుండాలి.. ప్రేక్షకులకి క్యాచీగా ఉండాలి.. కొత్తగా ఉండాలి. ఇన్ని అంశాలను చూసుకుని టైటిల్ని నిర్ణయిస్తారు. అందుకే, రకరకాల పేర్లు రాసుకుని నలుగుర్నీ అడిగి, చివరికి ఒకటి ఎంపిక చేస్తారు.

ఈ నేపథ్యంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించనున్న ఓ చిత్రానికి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ చిత్రం కోసం ఈ 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.

'పక్కా కమర్షియల్' అనేది ప్రస్తుత కాలంలో బాగా వాడుక పదం లాంటిది. సినిమాలకే కాకుండా, మనుషులకు కూడా దీనిని ప్రయోగిస్తుంటారు. అందుకే, ఇది బాగా పాప్యులర్.. దానికితోడు క్యాచీ టైటిల్ కూడా కావడంతో దీనిని నిర్ణయిస్తున్నారని చెబుతున్నారు.
Gopichand
Maruti
Geetha Arts

More Telugu News