Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Samantha is contacted for Shakuntalam
  • గుణశేఖర్ సినిమాలో సమంత?
  • వచ్చే నెల నుంచి 'బంగార్రాజు'
  • పాయల్ రాజ్ పుత్ వెబ్ సినిమా  
*  ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించే 'శాకుంతలం' సినిమాలో కథానాయిక ఎవరన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. టైటిల్ రోల్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు పూజ హెగ్డే నటిస్తుందంటూ వార్తలొచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, సమంతతో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
*  అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగును వచ్చే నెల 16న ప్రారంభించి సింగిల్ షెడ్యూలులో పూర్తిచేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తాడు.
*  కథానాయిక పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ వెబ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. అవినాశ్ కోకాటి చెప్పిన కథ నచ్చడంతో ఈ చిన్నది ఈ ప్రాజక్టుకు ఒప్పుకుందట.
Samantha
Gunashekhar
Nagarjuna
Payal Rajputh

More Telugu News