Pratyusha: బంగారు నక్లెస్ ను కానుకగా ఇచ్చి, ప్రత్యూషను పెళ్లికూతురిగా అలంకరించిన కేసీఆర్ భార్య శోభ!

KCR Wife Gifted Diamond Necles to Pratyusha
  • నేడు ప్రత్యూష వివాహం
  • నిన్న రాత్రి అలంకరించిన శోభ
  • ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో కార్యక్రమం
కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం నేడు జరగనున్న నేపథ్యంలో, నిన్న రాత్రి ఆమెను పెళ్లి కూతురిగా అలంకరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో జరుగగా, సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాజరై, వధువుకు డైమండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, మహిళాభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు హాజరయ్యారు. కాగా, చరణ్ రెడ్డితో ప్రత్యూష వివాహం నేడు రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లార్డు మాత సన్నిధిలో జరగనున్న సంగతి తెలిసిందే. 
Pratyusha
Sobha
KCR
Marriage

More Telugu News