Indrakaran Reddy: నిర్మల్ అయ్యప్ప ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు

Minister Indrakaran Reddy visits Nirmal Ayyappa Swamy Temple
  • కుటుంబంతో కలిసి దైవదర్శనం చేసుకున్న మంత్రి
  • మంత్రికి పూర్ణకుంభ స్వాగతం
  • పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేత
  • క్యాలెండర్ ఆవిష్కరించిన ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలోని అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి అయ్యప్ప ఆలయానికి వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, ఆలయ వర్గాలు రూపొందించిన 2021 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

అంతకుముందు, ఆలయానికి వచ్చిన మంత్రి కుటుంబానికి అర్చకులు, గురుస్వాములు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, ఇంద్రకరణ్ రెడ్డి ముక్కోటి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే.
Indrakaran Reddy
Ayyappa Temple
Nirmal
Telangana

More Telugu News