Kodimi: అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కు ఈ విధంగా థ్యాంక్స్ చెప్పారు!

Ananthapur district people expresses their gratitude towards CM Jagan
  • ఏపీలో క్రిస్మస్ నాడు ఇళ్ల పట్టాల పంపిణీ
  • అనంతపురం జిల్లాలోనూ పట్టాల అందజేత
  • సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కొడిమి ప్రజలు
  • థాంక్యూ జగనన్న అంటూ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిల్చున్న ప్రజలు 

ఏపీలో క్రిస్మస్ సందర్భంగా భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోనూ పట్టాలు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొడిమి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పొందిన ప్రజలు సీఎం జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. థాంక్యూ జగనన్న అంటూ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిల్చుని సీఎంపై తమ ప్రేమను చాటుకున్నారు. ఈ విన్యాసం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News