Avanthi Srinivas: పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ఊరుకోం... జగన్, విజయసాయిలను విమర్శించే స్థాయి వెలగపూడికి లేదు: అవంతి

Minister Avanthi take a dig ate TDP MLA Velagapudi Ramakrishna
  • విశాఖలో వెలగపూడి వర్సెస్ వైసీపీ నేతలు
  • కొనసాగుతున్న మాటల యుద్ధం
  • వెలగపూడి స్థాయి మరిచి మాట్లాడుతున్నారన్న అవంతి
  • వెలగపూడి అరాచకాలు ప్రజలకు తెలుసని వెల్లడి
విశాఖలో వైసీపీ నేతలకు, టీడీపీ ఎమ్మెల్మే వెలగపూడి రామకృష్ణకు మధ్య మాటలయుద్ధం నడుస్తోంది. దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. విశాఖలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి స్థాయి మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్, విజయసాయిలపై విమర్శలు చేసే స్థాయి వెలగపూడికి లేదని, పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి దృష్టి మరల్చడానికే ఇలా చేస్తున్నారని అవంతి ఆరోపించారు. వెలగపూడి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు.
Avanthi Srinivas
Velagapudi Ramakrishna
Visakhapatnam
Jagan
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News