Chinthamaneni Prabhakar: తన కుమార్తె పెళ్లికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్

Chintamaneni Prabhakar invites Revanth Reddy for his daughter wedding
  • చింతమనేని ఇంట పెళ్లిసందడి
  • త్వరలోనే పెద్దకుమార్తె వివాహం
  • ప్రముఖులకు ఆహ్వానాలు
  • ఇప్పటికే వెంకయ్యనాయుడు, చంద్రబాబులకు ఆహ్వానాలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. త్వరలో ఆయన పెద్ద కుమార్తె వివాహం జరగనుంది. ఈ క్రమంలో ఆయన ప్రముఖులను తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తదితరులను కలిసి పెళ్లిపత్రిక అందజేశారు. చింతమనేని ప్రభాకర్ తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు. తన పెద్దకుమార్తె పెళ్లికి రావాలంటూ కార్డు అందించి ఆహ్వానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించారు.
Chinthamaneni Prabhakar
Revanth Reddy
Invitation
Wedding

More Telugu News