సల్మాన్ ఖాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు హీరోలు

27-12-2020 Sun 16:26
  • ఇవాళ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు
  • పోటీలు పడి విషెస్ తెలుపుతున్న సెలబ్రిటీలు
  • ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపిన మహేశ్ బాబు, వెంకటేశ్
  • ఎల్లప్పుడూ సుఖసంతోషాలు కలగాలంటూ ఆకాంక్ష
Tollywood heroes wishes Salman Khan on his birthday
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సల్మాన్ కు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. టాలీవుడ్ హీరోలు మహేశ్ బాబు, వెంకటేశ్ కూడా ఈ బాలీవుడ్ కండలరాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ కూల్ సల్మాన్ ఖాన్ కు వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. సల్మాన్ కు ఎల్లప్పుడు మంచి ఆరోగ్యం, సంతోషం, సుఖశాంతులు లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇక, సీనియర్ హీరో వెంకటేశ్ స్పందిస్తూ, ఎంతో మంచి మనసున్నవాడు, దయాగుణం మెండుగా ఉన్నవాడు అని సల్మాన్ ను కీర్తించారు. తనకు మిత్రుడే కాకుండా సోదరుడిలాంటి వాడని తెలిపారు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్టు వెంకటేశ్ ట్విట్టర్ లో తెలిపారు.