Italy: 2 వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్!

  • పాంపీలో గుర్తించిన పురాతత్వ శాస్త్రవేత్తలు
  • పంది, బాతు, చేప, మేక మాంసపు ఆనవాళ్లు
  • క్రీస్తు శకం 79లో అగ్నిపర్వతం బద్దలై సమాధైన నగరం
2000 Year Old Roman Era Equivalent Of Fast Food Stall Unearthed In Italy

సాయంత్రం కాగానే చాలా మంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్తుంటారు. నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాగించేస్తుంటారు. మీకో విషయం తెలుసా.. ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇప్పటివి కావు. 2 వేల ఏళ్ల క్రితమూ ఉన్నాయంటే నమ్ముతారా! నమ్మితీరాలి.. ఇటలీ పురాతత్వ శాస్త్రవేత్తలు పాంపీలో అలాంటి ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను గుర్తించారు.

నిజానికి గత ఏడాదే దానిని పాక్షికంగా తవ్వి తీసినా.. ఈ ఏడాది దాని వద్ద పూర్తిగా తవ్వకాలు జరిపి ఆ వివరాలను బయటపెట్టారు. పాంపీలోని సిల్వర్ వెడ్డింగ్ స్ట్రీట్ లో రీజియో V అని పిలుస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉన్నట్టు నిర్ధారించారు. కోడి పుంజు, బాతు, పంది, మేక, గొర్రె మాంసాలతో పాటు వైన్ ను కూడా అమ్మేవారట అక్కడ. అందుకు సంబంధించిన పంది, మేక, చేప, నత్త, బాతుల ఎముకల ముక్కలు దొరికాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఫావా అనే ఓ రకం బీన్స్ తో వైన్ ను తయారు చేసేవారని తెలిపారు. అక్కడ పెట్టిన ఓ జాడీలో ఆ బీన్స్ దొరికాయన్నారు. అయితే, క్రీస్తు శకం 79వ సంవత్సరంలో మౌంట్ వెసువియస్ అనే అగ్నిపర్వతం బద్దలై పాంపీని మొత్తం బూడిద చేసిందట. ఆ ఘోర కలిలో 2 వేల నుంచి 15 వేల మంది దాకా ఆహుతైపోయారని అంచనా వేస్తున్నారు.

More Telugu News