Solo Brathuke So Better: తొలి రోజు తెలుగు సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’కు భారీ వసూళ్లు

Solo Brathuke So Better
  • సుబ్బు దర్శకత్వంలో సినిమా
  • హీరో, హీరోయిన్లుగా సాయి  తేజ్, నభా నటేశ్
  • నిన్న విడుదలైన సినిమా 
  • తెలుగు రాష్ట్రాల్లో 4.7 కోట్ల రూపాయల వసూళ్లు
  • దేశంలో మొత్తం 5.1 కోట్ల రూపాయలు
కరోనా వైరస్ విజృంభణ వల్ల విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపులతో తెలంగాణలోనూ ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి. పెద్ద సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సుబ్బు దర్శకత్వంలో హీరో సాయి  తేజ్, నభా నటేశ్ జంటగా నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నిన్న విడుదలైంది. చాలా కాలం తర్వాత థియేటర్లకు పెద్ద సినిమా రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు భారీగా వచ్చారు. దేశంలోనే కాకుండా అస్ట్రేలియాలోనూ తొలి రోజు ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 4.7 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దేశంలో మొత్తం 5.1 కోట్ల రూపాయాలు వచ్చాయి. ఈ సినిమా ఆస్ట్రేలియాలో నిన్న ఈ సినిమా 14.37 లక్షల రూపాయలు రాబట్టడం గమనార్హం.  ప్రేమ, పెళ్లి అనే విషయాలకు వ్యతిరేకంగా సాయితేజ్ ఇందులో నటించాడు. శ్రీ వెంక‌టేశ్వర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు.
Solo Brathuke So Better
sai tej
Tollywood

More Telugu News