France: బ్రిటన్ నుంచి విదేశాలకూ విస్తరిస్తున్న కొత్త స్ట్రెయిన్.. ఫ్రాన్స్‌లో తొలికేసు!

  • బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికుడిలో కొత్త స్ట్రెయిన్ గుర్తింపు
  • అతడిని కలిసిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు
  • ఇటలీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్‌లలోనూ కొత్త వైరస్
corona virus new stain found in france

బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా వైరస్‌లోని కొత్త రకం వైరస్ నెమ్మదిగా విదేశాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఫ్రాన్స్‌లోనూ కనిపించింది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు.

ఈ నెల 19న బాధితుడు బ్రిటన్ నుంచి రాగా, 21న నిర్వహించిన పరీక్షల్లో అతడికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతడిని ఐసోలేషన్‌లో ఉంచి, తదుపరి పరీక్షలు నిర్వహించగా, అతడికి సోకింది కొత్త రకం వైరస్సేనని తేలింది. దీంతో అతడిని కలిసిన వారిని గుర్తించేందుకు అధికారులు రంగంలోకి దిగారు.

నిజానికి బ్రిటన్‌లో కొత్త స్ట్రెయిన్ వెలుగుచూసిన వెంటనే బ్రిటన్ నుంచి రాకపోకలు సాగించే విమానాలపై ఫ్రాన్స్ నిషేధం విధించింది. అయితే, ఆ దేశంలోని తమ పౌరులు మాత్రం వెనక్కి వచ్చేందుకు అనుమతిచ్చింది. ఇలా వచ్చిన ప్రయాణికుడిలోనే ఇప్పుడు ఈ వైరస్ వెలుగు చూసింది. కాగా, ఇటలీలో ఒకరిలో, డెన్మార్క్‌లో ఏడుగురిలో, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌లో ఒక్కొక్కరిలో ఈ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు.

More Telugu News