Corona Virus: మార్చిలోనే దేశంలో అడుగుపెట్టిన కరోనా కొత్త స్ట్రెయిన్: ఐజీఐబీ

  • ప్రస్తుత వైరస్‌కు భిన్నమైన రకాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
  • దీనికి ‘ఎ4’గా నామకరణం
  • కొత్త వైరస్‌ను అంతం చేసిన రోగ నిరోధక వ్యవస్థ
  • బ్రిటన్‌ కంటే ఇక్కడే మ్యుటేషన్ అధికం
New Strain footpath in india found in march

బ్రిటన్‌లో తాజాగా వెలుగుచూసి ప్రపంచ దేశాలను మరోమారు వణికిస్తున్న కరోనా కొత్త వైరస్ నిజానికి ఈ ఏడాది మార్చిలోనే దేశంలోకి ప్రవేశించినట్టు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న వైరస్‌కు భిన్నమైన రకాలు మార్చిలోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలో ఒక రకాన్ని సూపర్ స్ప్రెడర్‌గా గుర్తించి దానికి ‘ఎ4’ అని పేరు పెట్టారు.

హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతాలలో సేకరించిన నమూనాల్లో ఈ ‘ఎ4’ మ్యుటేషన్ వైరస్ వెలుగు చూసింది. అయితే, మనలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడంతో జూన్ నాటికే ఈ సూపర్ స్ప్రెడర్ అంతమైంది. లేకుంటే దీని కారణంగా దేశంలో మరింత దారుణ పరిస్థితులు ఉత్పన్నమై ఉండేవని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతానికైతే కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం వెలుగుచూసిన రకం మరింత వేగంగా విస్తరిస్తుండడంతో అప్రమత్తత అవసరమని హెచ్చరించారు. నిజానికి బ్రిటన్ కంటే ఇక్కడే వైరస్ ఉత్పరివర్తనాలు ఎక్కువన్న ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్‌లు మ్యుటేషన్ వైరస్‌ను కూడా సమర్థంగా నిరోధిస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News