Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై మోహన్‌బాబు ఆరా.. ఆందోళన

Tollywood actor Mohanbabu worry about Rajinikanth health
  • అస్వస్థతతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్
  • తిరుపతి నుంచి రజనీ భార్య, కుమార్తెకు మోహన్‌బాబు ఫోన్
  • రక్తపోటు అదుపులోకి వచ్చిన వెంటనే డిశ్చార్జ్
హైదరాబాద్‌లో షూటింగులో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన రజనీ చిరకాల మిత్రుడు మోహన్‌బాబు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉండడంతో, అక్కడి నుంచే రజనీకాంత్ భార్య, కుమార్తెలకు ఫోన్ చేసి రజనీ ఆరోగ్యంపై ఆరా తీశారు. రజనీ ఆరోగ్యంగానే ఉన్నారని వారు బదులిచ్చారు.

కాగా, ‘అన్నాత్తే’ సినిమా షూటింగులో పాల్గొనేందుకు రజనీకాంత్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారు. షూటింగులో పాల్గొంటున్న ఆయన అస్వస్థతకు గురికావడంతో నిన్న అపోలో ఆసుపత్రిలో చేర్చారు. విషయం తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగానే రజనీ అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, రక్తపోటు అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
Rajinikanth
Mohan Babu
Tollywood
Appollo Hospital

More Telugu News