Ranbir Kapoor: కరోనా రాకపోతే ఈ పాటికి మా పెళ్లి జరిగిపోయేది: రణ్‌బీర్

Ranbir Kapoor reveals about his marriage with Alia Bhatt
  • అలియా భట్ నా గర్ల్ ఫ్రెండ్
  • లాక్ డౌన్ సమయంలో అలియా ఎన్నో విషయాలు నేర్చుకుంది
  • నేను కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపాను

బాలీవుడ్ హీరోహీరోయిన్లు రణబీర్ కపూర్, అలియా భట్ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లాడబోతున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. పెళ్లికి రణబీర్ కపూర్ తల్లి కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి గురించి రణబీర్ కపూర్ ఇంత వరకు బహిరంగంగా స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణబీర్ మాట్లాడుతూ, తమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు.

అలియా భట్ తన గర్ల్ ఫ్రెండ్ అని ఈ సందర్భంగా రణబీర్ చెప్పాడు. కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఈ పాటికి తమ పెళ్లి అయిపోయేదని తెలిపాడు. ఇప్పటికైతే పెళ్లి గురించి ఇంతకు మించి చెప్పలేనని అన్నాడు. లాక్ డౌన్ సమయంలో అలియా ఎన్నో విషయాలు నేర్చుకుందని తెలిపాడు.

స్క్రీన్ రైటింగ్ నుంచి గిటార్ వరకు అన్ని విషయాల్లో పురోగతి సాధించిందని చెప్పాడు. తాను మాత్రం ప్రతి రోజు రెండు, మూడు సినిమాలు చూశానని... కొన్ని పుస్తకాలను చదివానని తెలిపాడు. లాక్ డౌన్ సమయంలో కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపానని చెప్పాడు. ప్రస్తుతం అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News