Aliens: ఒకప్పుడు ఏలియన్స్ ఉండేవారు.. వాటి సాంకేతికతే వారిని అంతం చేసింది: తాజా అధ్యయనం వెల్లడి

Milky Way may be home to dead aliens wiped out by their own technology
  • 800 కోట్ల ఏళ్ల కిందటే గెలాక్సీలో అవి పుట్టాయి
  • సాంకేతికత పెరిగే కొద్దీ మన నాగరికతలూ అంతరించాయి
  • ఏలియన్ల విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు

ఏలియన్స్.. అదే గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇప్పటికీ బదులు దొరకని ప్రశ్న ఇది. ఉన్నారని కొందరు.. అలా చెప్పే వాళ్లది అభూత కల్పన అని ఇంకొందరు.. ఎవరికి తోచింది వారు రకారకాలుగా చెబుతున్నారు. అయితే, వాటి జాడను గుర్తించేందుకు ప్రపంచంలోని శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం వెల్లడైంది. ‘ఏలియన్స్ ఉండేవారు గానీ.. వాటి టెక్నాలజీనే వారిని అంతమొందించింది’ అంటూ ఈ కొత్త అధ్యయనం తేల్చింది.

పాలపుంతలోని నక్షత్రమండలంలో ఏలియన్స్ ఉండేవారని, అయితే వారంతా చనిపోయారని ఈ అధ్యయనం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే, అంతరించిపోయి ఉండొచ్చట. అమెరికాలోని కాల్టెక్ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి ఈ మాట చెప్పారు. దాదాపు 800 కోట్ల ఏళ్ల కిందట గెలాక్సీలో ఏలియన్స్ పుట్టి ఉంటారని చెబుతున్నారు. శాస్త్ర సాంకేతికతలో పురోగతి సాధించే కొద్దీ ఎన్నో నాగరితకలు అంతరించిపోయాయని, ఏలియన్స్ కూడా అలాగే అంతరించిపోయి ఉంటారని అంటున్నారు.

‘‘శాస్త్ర సాంకేతికతలే మనిషి వినాశనానికి, జీవుల అంతానికి కారణమవుతాయని 1961లో హోయర్నర్ సిద్ధాంతం చెబుతోంది. 1966లో సాగన్, స్క్లోవ్ స్కీ కూడా అదే చెప్పారు. అంతకుముందు చేసిన ఎన్నో స్టడీలు సొంత టెక్నాలజీలే మనిషి అంతానికి దారి తీస్తాయని చెప్పాయి. ఇప్పుడు ఏలియన్స్ విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు’’ అని పరిశోధకులు చెబుతున్నారు. ఒకవేళ గెలాక్సీలో ఎక్కడైనా ఏలియన్స్ ఉన్నా.. వారి వయసు చాలా తక్కువేనని అంటున్నారు. భూమికి దూరంగా ఎక్కడో గ్రహాంతరజీవులు ఉంటాయంటున్నారు.

  • Loading...

More Telugu News