Jagan: 17,500 వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నాం: 'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో సీఎం జగన్

  • తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించిన సీఎం  
  • తొలి దశలో 16.5 లక్షల ఇళ్ల నిర్మాణం
  • 1.24 కోట్ల మందికి లబ్ధి కలుగుతుంది  
Constructing 17500 YSRC Jagan colonies says Jagan

'పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం కొమరగిరి మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అక్కడ పైలాన్ ను ఆవిష్కరించారు. అక్కడ నిర్మించిన మోడల్ హౌస్ ను పరిశీలించారు.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ, 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రూ. 28 వేల కోట్లతో తొలి దశలో 16.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని తెలిపారు. రెండు వారాల పాటు ఇళ్ల పట్టాల పంపిణీని ఒక పండుగలా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం వల్ల 1.24 కోట్ల మందికి లబ్ధి కలుగుతుందని తెలిపారు.

తాము కడుతున్నది ఇళ్లను కాదని... ఏకంగా గ్రామాలనే నిర్మిస్తున్నామని జగన్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17,500 వైయస్సార్ జగనన్న కాలనీలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేసేందుకు అనుక్షణం కృషి చేస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ప్లాటు విలువ రూ. 4 లక్షలు ఉంటుందని చెప్పారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా ఇంటిని అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ఎల్ఈడీ లైట్లతో పాటు ఇంటి పైన ఒక సింటెక్స్ ట్యాంక్ ఉంటుందని చెప్పారు.

More Telugu News