Congress: కేరళలో వద్దు, బెంగాల్‌లో ముద్దు.. వామపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ!

  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ 
  • పొత్తుకు సుముఖంగా వామపక్షాలు
  • కేరళలో మాత్రం సీన్ రివర్స్
Congress announces alliance with Left parties

వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలతో పొత్తుకు కాంగ్రెస్ సై అంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ, బెంగాల్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వామపక్షాలతో పొత్తుకు అధిష్ఠానం అంగీకరించినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

వామపక్షాలు కూడా కాంగ్రెస్‌తో పొత్తుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. మరోవైపు, కేరళలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండడం గమనార్హం. కాగా, బెంగాల్‌లో మమత ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దింపాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. టీఎంసీకి చెందిన పలువురు నేతలను చేర్చుకుంటూ మమతను ఇరకాటంలోకి నెట్టేస్తోంది.

More Telugu News