Vandebharat: వందేభారత్ ట్రైన్‌సెట్ల తయారీ కోసం బిడ్ వేసిన చైనా సంస్థకు ఇండియన్ రైల్వే షాక్!

  • 44 ట్రైన్‌సెట్స్ ప్రాజెక్టు విలువ రూ. 1,800 కోట్లు
  • సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో
  • రేసులో మిగిలింది ఇక రెండే
China player disqualified for vande bharat trainsets project

వందేభారత్ ట్రైన్‌సెట్స్ తయారీ ప్రాజెక్టు కోసం బిడ్ దాఖలు చేసిన చైనా సంస్థకు భారతీయ రైల్వే షాకిచ్చింది. బిడ్ దాఖలు చేసే అర్హత దానికి లేదంటూ తిరస్కరించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 1,800 కోట్లు కాగా, ఇందులో భాగంగా 44 ట్రైన్స్ సెట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇండియన్ రైల్వే టెండర్లు ఆహ్వానించగా, బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియాలు బిడ్లు దాఖలు చేశాయి.

సీఆర్ఆర్‌సీ-పయనీర్ సంస్థ బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. వందేభారత్ ట్రైన్స్ సెట్స్ తయారీ కాంట్రాక్ట్ దక్కించుకోవాలంటే ఆ సంస్థ మూలాలు భారత్‌లో ఉండాలి. అయితే, సీఆర్ఆర్‌సీ-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా మూలాలు చైనాలో ఉండడంతో ఆ సంస్థ దాఖలు చేసిన బిడ్‌ చెల్లదని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ రేసులో బీహెచ్‌ఈఎల్, మేధాసెర్వో డ్రైవ్స్ మాత్రమే మిగిలాయి.

More Telugu News