కేన్ విలియమ్సన్ సన్ రైజర్స్ తోనే ఉంటాడు: కెప్టెన్ వార్నర్ స్పష్టీకరణ

24-12-2020 Thu 21:18
  • విలియమ్సన్ మరో జట్టుకు ఆడతాడని ప్రచారం
  • వార్నర్ దృష్టికి తీసుకెళ్లిన అభిమాని
  • ఇలాంటివి మొదటిసారి వింటున్నానన్న వార్నర్
  • విలియమ్సన్ ఎక్కడికీ వెళ్లడని వెల్లడి
David Warner clarifies Kane Williamson will be continued with SRH

ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించే న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వచ్చే సీజన్ లో మరో జట్టుకు ఆడతాడని వార్తలు వస్తున్నాయి. ఇదే అంశాన్ని ఓ అభిమాని సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ అభిమానికి వార్నర్ బదులిస్తూ, కేన్ విలియమ్సన్ ఎక్కడికీ వెళ్లడని, సన్ రైజర్స్ తోనే ఉంటాడని స్పష్టం చేశాడు. తనకు తెలిసినంత వరకు ఇదే నిజమని పేర్కొన్నాడు. కేన్ విలియమ్సన్ గురించి ఇలాంటి వార్తలను మొదటిసారిగా వింటున్నానని తెలిపాడు. సన్ రైజర్స్ ఓడిన మ్యాచ్ ల్లోనూ కేన్ విలియమ్సన్ అద్భుత ప్రతిభ చూపిన ఘట్టాలున్నాయి. విలియమ్సన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడి 45 సగటుతో 317 పరుగులు చేశాడు.