Johanna Quaas: 95 ఏళ్ల వయసులో ఈ పెద్దావిడ చేసే జిమ్నాస్టిక్ విన్యాసాలు చూస్తే మతిపోతుంది!

  • అబ్బురపరుస్తున్న జర్మనీ జిమ్నాస్ట్ జొహాన్నా క్వాస్
  • వయసు పెరిగినా సడలని ఫిట్ నెస్
  • శరీరాన్ని విల్లులా వంచుతూ అద్భుత విన్యాసాలు
  • గిన్నిస్ బుక్ లోనూ స్థానం
  • వీడియో వైరల్
Johanna Quaas  the oldest Gymnast in the world

వయసు పెరిగేకొద్దీ వృద్ధుల్లో అనేక సమస్యలు వస్తుంటాయి. శారీరకంగా బలహీనపడడమే కాదు, అనేక అనారోగ్యాల బారినపడుతుంటారు. అయితే 95 ఏళ్ల వయసులో జొహాన్నా క్వాస్ అనే జర్మనీ వయోవృద్ధురాలు చేసే జిమ్నాస్టిక్స్ విన్యాసాలు చూస్తే మతిపోతుంది. అసలా వయసుకు నిటారుగా నిల్చోవడమే చాలామందికి కష్టమైపోతుంది. కానీ జొహాన్నా మాత్రం శరీరాన్ని ఎటు కావాలంటే అటు వంచుతూ, చూపరులను విస్మయానికి గురిచేస్తోంది.

వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని జొహాన్నా తన జిమ్నాస్టిక్స్ నైపుణ్యంతో చాటుతోంది. ఆమె విన్యాసాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత పెద్ద వయసు జిమ్నాస్ట్ ఈ జర్మనీ దేశస్థురాలే. ఆ మేరకు గిన్నిస్ బుక్ లోనూ స్థానం సంపాదించింది. అన్నట్టు జొహాన్నా భర్త గెరార్డ్ క్వాస్ ఓ జిమ్నాస్టిక్స్ కోచ్. వీరికి ముగ్గురు అమ్మాయిలున్నారు.

More Telugu News