Jagapathi Babu: వెరైటీ టైటిల్ తో జగపతిబాబు కొత్త సినిమా

Jagapathibabu plays a new role in his latest movie
  • విజయవంతంగా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్
  • 'ఫాదర్ - చిట్టి - ఉమ -కార్తీక్'లో ప్రధాన పాత్ర
  • యువజంటగా కార్తీక్, అమ్ము అభిరామి
  • రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిర్మాణం  


ఒకప్పుడు విభిన్న కథా చిత్రాలు చేస్తూ కుటుంబకథా చిత్రాల కథానాయకుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు.. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా మరో కోణాన్ని చూపిస్తున్నారు. కొన్ని చిత్రాలలో పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న తరహా పాజిటివ్ పాత్రలు కూడా పోషిస్తున్నారు. మొత్తానికి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ విజయవంతంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలో తాజాగా జగపతిబాబు ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రానికి 'ఫాదర్ - చిట్టి - ఉమ -కార్తీక్' (FCUK)  అనే వెరైటీ టైటిల్ ని నిర్ణయించారు. కార్తీక్, అమ్ము అభిరామి ఇందులో యువజంటగా నటించగా, బాలనటి సహశ్రిత కూడా కీలక పాత్ర పోషించింది.

శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి నూతన దర్శకుడు విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News