Jagan: పొరబాటున నేను తప్పు చేసి ఉంటే మన్నించండి: గండికోట నిర్వాసితులను కోరిన సీఎం జగన్

  • కడప జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్
  • పులివెందుల సభలో ప్రసంగం
  • గండికోట, చిత్రావతి నిర్వాసితులకు ధన్యవాదాలు
  • మీ త్యాగాలు నిరుపమానం అంటూ ప్రశంసల జల్లు
  • మీ వల్ల లక్షలాదిమందికి మేలు జరుగుతోందని వెల్లడి
CM Jagan said apologies to Gandikota settlers

కడప జిల్లాలో సీఎం జగన్ రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన పులివెందులలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గండికోట, చిత్రావతి నిర్వాసితులకు ధన్యవాదాలు తెలిపారు. నిర్వాసితుల త్యాగం వల్లే గండికోటలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ సాధ్యమవుతోందని కొనియాడారు.

కాగా, గండికోట నిర్వాసితులను మన్నించాలని ముఖ్యమంత్రి కోరారు. 'పొరపాటున నేను తప్పు చేసి ఉంటే మన్నించండి' అని పేర్కొన్నారు. నిర్వాసితులు చేసిన త్యాగం ఎనలేనిదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజల త్యాగాల వల్లే లక్షలాది రైతులకు మేలు జరుగుతోందని, అందుకే నిర్వాసితుల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా చూడాలని కలెక్టర్ ను ఆదేశించారు.

ఏనాడూ గండికోట రిజర్వాయర్ లో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంచే పరిస్థితి లేదని అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కింద పరిహారమిచ్చి గండికోటలో నీరు నిల్వ ఉంచాం అని వెల్లడించారు. చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు 18 నెలల్లో పూర్తిచేయవచ్చని నిరూపించామని వివరించారు.

More Telugu News