Stock Market: వరుసగా మూడోరోజు... నేడు కూడా భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock markets close in profits
  • సెన్సెక్స్ 529.36 పాయింట్ల లాభం  
  • నిఫ్టీ 148.15 పాయింట్ల లాభం
  • లాభాలలో వేదాంత, టాటా మోటార్స్
  • నష్టాలలో వోడాఫోన్ ఐడియా, ఇన్ఫోసిస్  
మొన్న సోమవారం నాడు భారీగా నష్టపోయిన మన స్టాక్ మార్కెట్లు, ఆ తర్వాత వరుసగా పుంజుకుని లాభాల బాటపట్టాయి. ఈ క్రమంలో మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు వరుసగా మూడో రోజున కూడా లాభాలు దండుకున్నాయి. ఈ రోజు మార్కెట్ ప్రారంభం అయిన దగ్గర నుంచీ మార్కెట్లు లాభాలతోనే పయనించాయి.

బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు బాగా జరగడంతో ఆఖరికి భారీ లాభాలతో ముగిశాయి. దీంతో సెన్సెక్స్ 529.36 పాయింట్ల లాభంతో 46973.54 వద్ద, నిఫ్టీ 148.15 పాయింట్ల లాభంతో 13749.25 వద్ద క్లోజ్ అయ్యాయి. రేపు క్రిస్మస్ కావడంతో మార్కెట్లకు సెలవు.

ఇక, నేటి సెషన్లో వేదాంత, అంబుజా సిమెంట్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ తదితర కంపెనీల షేర్లు లాభాలు పొందాయి.

అలాగే, వోడాఫోన్ ఐడియా, ఇన్ఫోసిస్, డీఎల్ఎఫ్, అమరరాజా బ్యాటరీ, విప్రో, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు చవిగొన్నాయి.
Stock Market
BSE
NSE
Tata Motars
HDFC

More Telugu News