UK: ‘బ్రిటన్ కరోనా’తో ఏడు కొత్త లక్షణాలు.. వివరాలు ఇవిగో!

7 new symptoms associated with new UK corona strain
  • ఆయా లక్షణాలతో జాబితా విడుదల చేసిన ఎన్ హెచ్ఎస్ 
  • తలనొప్పి, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం..
  • అలసట, విరేచనాలు, గందరగోళం వంటి లక్షణాలు  
ప్రస్తుతం బ్రిటన్ లో పుట్టిన కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. బ్రిటన్ నుంచి వచ్చే.. అక్కడకు వెళ్లే విమానాలన్నింటినీ చాలా దేశాలు రద్దు చేశాయి. దాని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో పాక్షికంగా లాక్ డౌన్లు పెట్టేస్తున్నారు. ఇండియాలోనూ కర్ణాటక, మహారాష్ట్రల్లోని కొన్ని సిటీల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఈ రకం కరోనాను గుర్తించడానికి నిర్దిష్టమైన టెస్టుల్లేవు. ఆర్టీపీసీఆర్ టెస్టులే చేసి.. పాజిటివ్ వస్తే దాని జన్యు క్రమాన్ని తేల్చే పనిలో పడ్డారు నిపుణులు, శాస్త్రవేత్తలు.

మరి, అప్పటి వరకు మనకు ఆ వైరస్ సోకిందన్న అనుమానమొస్తే గుర్తించడం ఎలా? అందుకే.. రూపు మార్చుకున్న ఈ కొత్త వైరస్ తో కలుగుతున్న ఏడు కొత్త లక్షణాలను బ్రిటన్ అత్యున్నత వైద్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ హెచ్ఎస్) వెల్లడించింది. ఇప్పటిదాకా జ్వరం, దగ్గు, వాసన పసిగట్టలేకపోవడం, రుచి తెలుసుకోలేకపోవడం  వంటివి మాత్రమే కొవిడ్ లక్షణాలని అందరికీ తెలుసు. ఇప్పుడు వాటికి జత కలిసిన కొత్త స్ట్రెయిన్ లక్షణాలివే...

* అలసట
* ఆకలి లేకపోవడం
* విపరీతమైన తలనొప్పి
* విరేచనాలు
* గందరగోళంగా అనిపించడం
* కండరాల నొప్పులు

ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చెయ్యకుండా వెంటనే టెస్టు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
UK
COVID19
CoViD19 symptoms
NHS

More Telugu News