Jagan: ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్

CM Jagan offers prayers at YSR Ghat in Idupulapaya
  • మూడ్రోజుల పర్యటనకు కడప జిల్లా వచ్చిన సీఎం జగన్
  • నిన్న సాయంత్రం ఇడుపులపాయ చేరిక
  • తండ్రి విగ్రహానికి అంజలి ఘటించిన జగన్
  • ఆపై క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైనం
  • కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
సీఎం జగన్ మూడ్రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నిన్న సాయంత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి వైఎస్సార్ ఘాట్ వద్ద ఈ ఉదయం ఘననివాళి అర్పించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలదండ వేసి అంజలి ఘటించారు. అనంతరం ఇడుపులపాయ ప్రార్థన మందిరంలో కుటుంబంతో కలిసి మినీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, అర్ధాంగి వైఎస్ భారతిలతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.
Jagan
YSR
Ghat
Idupulapaya
Kadapa District

More Telugu News