KTR: విజ్ఞప్తుల చిట్టాతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాసిన కేటీఆర్

KTR writes to Union Minister Piyush Goyal for Budget allocations
  • త్వరలోనే కేంద్ర బడ్జెట్
  • తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని వినతి
  • ఫార్మాసిటీకి నిధులు కోరిన వైనం
  • లేఖలో ఇండస్ట్రియల్ కారిడార్ల ప్రస్తావన
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. త్వరలోనే కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలో తన లేఖను విజ్ఞప్తులతో నింపేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రత్యేక నిధులు కేటాయించాలని, నేషనల్ డిజైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రాథమిక మూలధనాన్ని వెంటనే అందించాలని కోరారు.

హైదరాబాద్-వరంగల్... హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటుకు రూ.5 వేల కోట్ల ఖర్చవుతుందని, ఈ రెండు కారిడార్లను ముందుకు తీసుకెళ్లేందుకు తమ సర్కారు కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. అందుకే ఈ రెండు కారిడార్ల ఏర్పాటుకు రానున్న బడ్జెట్లో 50 శాతం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం అభిలషిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా సాకారం చేసే దిశగా తమ ఫార్మాసిటీ అంతర్జాతీయస్థాయికి ఎదుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక, నేషనల్ డిజైనింగ్ సెంటర్ కోసం 200 కోట్ల రూపాయల ప్రాథమిక మూల ధనాన్ని ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. ఈ సెంటర్ ఏర్పాటు కోసం తాము ఉచితంగానే భూమిని సమకూర్చుతున్నామని తెలిపారు. గచ్చిబౌలిలోని అత్యంత విలువైన 30 ఎకరాల భూమిని కేటాయిస్తున్నామని వివరించారు.
KTR
Piyush Goyal
Letter
Budget
Allocations
Telangana

More Telugu News