Honda: భారత్ లో రెండు మోడళ్ల ఉత్పత్తికి మంగళం పాడిన హోండా

  • సివిక్, సీఆర్-వీ కార్ల తయారీకి స్వస్తి పలికిన హోండా
  • గ్రేటర్ నోయిడా ప్లాంట్ లో నిలిచిన ఉత్పత్తి
  • ప్లాంట్ ను రాజస్థాన్ కు తరలింపు
  • ఈ రెండు మోడళ్ల విక్రయాలపై హోండా అసంతృప్తి
Honda halts Civic and CRV manufacturing

జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా భారత్ లో రెండు మోడళ్ల తయారీకి స్వస్తి పలికింది. గ్రేటర్ నోయిడాలోని తన యూనిట్ లో సివిక్ (సెడాన్),  సీఆర్-వీ (ఎస్ యూవీ) మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాదు, తయారీ కేంద్రం మొత్తాన్ని రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లా తపుకారా ప్లాంట్ కు తరలించేందుకు నిర్ణయించింది. సీఆర్-వీ, సివిక్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, తపుకారా ప్లాంట్ లో చిన్న, మీడియం సైజు కార్లను తయారుచేస్తామని హోండా కార్స్ ఇండియా విభాగం ప్రతినిధి వెల్లడించారు.

తమ సంస్థ తయారుచేసే కార్లలో ఈ రెండు మోడళ్లు విక్రయాల పరంగా అట్టడుగున ఉన్నాయని, గత 6 నెలల్లో కేవలం 850 సివిక్ కార్లు, 100 సీఆర్-వీ ఎస్ యూవీలను మాత్రమే విక్రయించగలిగామని తెలిపారు. అభివృద్ధి పరిచిన హోండా సిటీ, హోండా అమేజ్, జాజ్ వంటి మోడళ్లు వేల సంఖ్యలో అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ రెండు మోడళ్లు ఇక అందుబాటులో ఉండవని వివరించారు.

More Telugu News