MR SAM: మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

  • ఒడిశాలోని బాలసోర్ కేంద్రం నుంచి ప్రయోగం
  • మానవ రహిత విమానాన్ని కుప్పకూల్చిన మిస్సైల్
  • మాక్ 2 వేగంతో పయనం
  • పరిధి 100 కిలోమీటర్లు
  • త్రివిధ దళాలకు ఉపయుక్తం
 India test fires MRSAM successfully

మునుపెన్నడూ లేని విధంగా భారత్ ఆయుధ పరీక్షలను ముమ్మరం చేసింది. నెలలో కనీసం రెండు క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ అస్త్రాలకు మరింత పదును పెడుతోంది. తాజాగా, మధ్యశ్రేణి క్షిపణి (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్)ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దూసుకెళ్లిన ఈ క్షిపణి గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించింది. బన్షీ మానవరహిత విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, దాన్ని ఈ క్షిపణి అత్యంత కచ్చితత్వంతో తుత్తునియలు చేసింది.

ఈ క్షిపణిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేస్తోంది. ఈ క్షిపణిని సైన్యం, వాయుసేన, నేవీ ఎవరి అవసరాలకు తగిన విధంగా వారు ఉపయోగించుకునే వీలుంది. మాక్ 2 వేగంతో ప్రయాణించే ఈ మిస్సైల్ పరిధి 100 కిలోమీటర్లు. ఇవాళ ఆర్మీ వెర్షన్ మిస్సైల్ ను పరీక్షించారు.

More Telugu News