'సలార్'లో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు.. ఇప్పటికే ఒకరి ఎంపిక!

23-12-2020 Wed 16:53
  • 'రాధే శ్యామ్' తర్వాత మూడు సినిమాలు 
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'
  • జనవరి మూడో వారం నుంచి షూటింగ్ 
  • బాలీవుడ్ భామ దిశా పఠానీ ఎంపిక   
Two heroins opposite Prabhas in Salaar

ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమాలో నటిస్తున్న హీరో ప్రభాస్ తదుపరి చిత్రాలుగా ప్రస్తుతం మూడు సినిమాలు లైన్లో వున్నాయి. వీటిలో ఒకటి 'ఆదిపురుష్', మరొకటి వైజయంతీ మూవీస్ నిర్మించే చిత్రం కాగా, ఇంకొకటి 'సలార్'.

ఇక వీటి షూటింగుల విషయానికి వస్తే, ఈ మూడు చిత్రాలు కూడా జనవరిలోనే ప్రారంభమయ్యేలా వున్నాయి. వీటిలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే 'సలార్' జనవరి మూడో వారంలో మొదలవుతుంది. నాలుగు నెలలలో చిత్రాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారు.  

భారీ బడ్జెట్టుతో యాక్షన్ ప్రధాన చిత్రంగా రూపొందే ఈ 'సలార్'లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒక హీరోయిన్ గా ఇప్పటికే దిశా పఠానీని ఖరారు చేసినట్టు వార్తలొస్తున్నాయి. మరో కథానాయిక ఎంపిక ప్రస్తుతం జరుగుతున్నట్టు, ఆమెను కూడా బాలీవుడ్ నుంచే తీసుకుంటారని సమాచారం.