Sensex: ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 437 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 135 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.64 శాతం పెరిగిన రిలయన్స్ షేర్
Sensex closes 437 points high

కరోనా కొత్త వైరస్ భయాలతో మొన్న కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు నిన్న, ఈరోజు లాభాలను చవిచూశాయి. వైరస్ కట్టడికి పలు దేశాలు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండటంతో పాటు, కొత్త వైరస్ కు కూడా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.

ఈ నేపథ్యంలో ఈరోజు కూడా మార్కెట్లు భారీ లాభాలను గడించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 437 పాయింట్లు పెరిగి 46,444కి చేరుకుంది. నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 13,601కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.67%), ఇన్ఫోసిస్ (2.64%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.35%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.14%), ఐటీసీ (2.13%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-0.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.37%), ఎన్టీపీసీ (-0.35%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.02%).

More Telugu News