Kajal Agarwal: సినిమా ప్రొడక్షన్ లోకి కాజల్ భర్త?

Kajals husband planning to setup production company
  • ఇటీవలే 'ఆచార్య' షూటింగులో పాల్గొన్న కాజల్ 
  • భర్తను సెట్లో అందరికీ పరిచయం చేసిన ముద్దుగుమ్మ
  • చిన్న చిత్రాలు, వెబ్ సీరీస్ నిర్మించే యోచనలో గౌతమ్  
కథానాయికగా తను ఇంకా ఫామ్ లో ఉండగానే.. తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్లాడిన సంగతి విదితమే. కొవిడ్ కారణంగా పెళ్లి వేడుకను సింపుల్ గా చేసుకున్నప్పటికీ, ఆ వెంటనే చక్కగా హనీమూన్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చింది. ఈమధ్యే కొన్ని రోజులు 'ఆచార్య' షూటింగులో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. భర్తను వెంట తీసుకొచ్చి, అందరికీ పరిచయం చేసింది. ఇక షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో తాజాగా ముంబై వెళ్లిపోయింది.

ఇదిలావుంచితే, భర్తని కూడా తన సినిమా ఫీల్డులోకి దింపడానికి అమ్మడు ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో భర్త చేత ప్రొడక్షన్ కంపెనీని నెలకొల్పించే ఆలోచన చేస్తోందని అంటున్నారు. తమ బ్యానర్ ద్వారా ముందుగా చిన్న బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూ.. కొత్త నటీనటులను పరిచయం చేయాలని ఈ దంపతులు ప్రణాళికలు వేస్తున్నారట.

అలాగే, ఓటీటీ సంస్థలకు కూడా వెబ్ సీరీస్ వంటి కంటెంట్ సమకూర్చాలని ఆలోచిస్తున్నారని సమాచారం. మొత్తానికి కాజల్ తన భర్తని కూడా ఇదే ఫీల్డులో కొనసాగించాలని చూస్తోందన్నమాట!      
Kajal Agarwal
Goutham Kichlu
Acharya

More Telugu News