Steve Smith: కోహ్లీ లేకపోవడం భారత్ కు ఇబ్బందికరమే: స్మిత్

Its difficult for India without Kohli says Smith
  • కోహ్లీ ఇంటికి వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయం
  • అతని జీవితంలో ఇదొక మరిచిపోలేని ఘటన
  • బాక్సింగ్ డే టెస్టులో సత్తా చాటుతాం
తన భార్య అనుష్క తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తిరుగుపయనమైన సంగతి తెలిసిందే. పితృత్వ సెలవు తీసుకుని ఆయన స్వదేశానికి పయనమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ భారత జట్టుకు దూరం కావడంపై ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ స్పందిస్తూ, కోహ్లీ లేకపోవడం భారత్ కు లోటేనని చెప్పాడు. అయితే, తొలి బిడ్డ పుట్టబోతున్న సందర్భంలో కోహ్లీ ఇంటికి వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయమని ప్రశంసించాడు. కోహ్లీ జీవితంలో ఇదొక మరిచిపోలేని ఘడియ అని... దానిని అతను కోల్పోకూడదని చెప్పాడు.

మెల్ బోర్న్ లో జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో సత్తా చాటుతామని స్మిత్ చెప్పాడు. ఎంసీజీ గ్రౌండ్ లో బ్యాటింగ్ చేయడానికి తాను ఇష్టపడతానని అన్నాడు. బాక్సింగ్ డే  టెస్ట్ మ్యాచ్ ఆడాలని తాను చిన్నప్పటి నుంచి కలలు కనేవాడినని చెప్పాడు.
Steve Smith
Australia
Virat Kohli
Team India

More Telugu News