నల్ల జెండాలు చూపించిన రైతులు.. వెనక్కి వెళ్లిపోయిన సీఎం!
- హర్యానా ముఖ్యమంత్రి కట్టర్ ను అడ్డుకున్న రైతులు
- అంబాలకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘటన
- రైతులు రోడ్డును బ్లాక్ చేయడంతో వెనుదిరిగిన సీఎం
ఈ ఘటనతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు ముచ్చెమటలు పట్టాయి. సీఎం కాన్వాయ్ కి దారి ఇవ్వాలంటూ రైతులను వారు బతిమాలారు. ఈ సందర్భంగా నల్లజెండాలతో పాటు, కర్రలను కూడా రైతులు చూపించారు. పెద్ద సంఖ్యలో రైతులు రోడ్డును బ్లాక్ చేసి ఉండటంతో... సీఎం కాన్వాయ్ వెనుదిరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు అంబాలాకు ఖట్టర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ నెల 1న కేంద్ర మంత్రి రతన్ లాల్ కటారియాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అంబాలా సమీపంలోని ఒక గ్రామంలో ఆయనకు కూడా రైతులు నల్ల జెండాలను చూపించారు. కటారియా అంబాలా నుంచి ఎంపీగా గెలుపొందడం గమనార్హం.