USA: అమెరికాలో రూ.66 లక్షల కోట్లతో కరోనా ప్యాకేజి... పచ్చజెండా ఊపిన చట్టసభలు

  • కరోనాతో బాగా నష్టపోయిన అమెరికా
  • ప్రత్యేక నిధికి ఓకే చెప్పిన సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్
  • ట్రంప్ సంతకం అనంతరం చట్టంగా మారనున్న బిల్లు
  • ప్రతి అమెరికన్ కు ఆర్థిక ప్రయోజనం
US to release covid relief package after house passed the bill

ప్రపంచంలో కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో అమెరికా ఒకటి. ఇప్పటికీ అక్కడ కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. అగ్రరాజ్యం అయినప్పటికీ కరోనా ప్రభావంతో ఆర్థికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, జాతీయ ఆర్థిక వ్యవస్థలకు ఊతమిచ్చేందుకు గాను రూ.66 లక్షల కోట్ల ఉద్దీపన నిధి మంజూరుకు అమెరికా చట్టసభలు అంగీకారం తెలిపాయి.

ఈ కరోనా ప్యాకేజిపై సెనేట్ లోనూ, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లోనూ ఓటింగ్ నిర్వహించారు. సెనేట్ లో 92-6, హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ లో 359-53 తేడాతో బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలోనే ఈ బిల్లుపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు. ఆపై ఇది చట్టంగా రూపుదిద్దుకుంటుంది.

కాగా, ఈ కొవిడ్ ప్యాకేజి విడుదల అయితే అమెరికన్లకు ఒక్కొక్కరికి 600 డాలర్ల మేర లబ్ది చేకూరనుంది. నిరుద్యోగులకు సైతం ఈ మేరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది.

More Telugu News