Jagan: నోరు జారిన వైసీపీ ఎమ్మెల్యే.. పట్టించుకోని నేతలు!

YSRCP MLA by mistake addresses Jagan as corrupted
  • నిన్న శృంగవరపుకోటలో జగన్ జన్మదిన వేడుకలు
  • వేడుకలో ప్రసంగిస్తూ నోరు జారిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు
  • అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు అని వ్యాఖ్య
రాజకీయ నాయకులు ప్రసంగించేటప్పుడు ఒక్కోసారి పొరపాటున చేసే వ్యాఖ్యలు వారిని ఎంతో ఇబ్బందిలోకి నెడుతుంటాయి. చిన్న స్థాయి నేతలే కాదు పెద్దపెద్ద నాయకులు కూడా మాటల మధ్యలో నాలుక జారుతుంటారు. ఆ తర్వాత సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనే మరొకటి చేసుకుంది.

శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిన్న సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ,'అవినీతి పాలన అందించగల ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే... అది జగన్ గారు మాత్రమే' అని ఆయన అన్నారు. నీతివంతమైన పాలన అనబోయి పొరపాటున అవినీతి పాలన అని ఆయన అనేశారు. అయితే పక్కనున్న వారు కూడా ఆ విషయాన్ని పట్టించుకోకుండా చప్పట్లు కొట్టడం గమనార్హం.
Jagan
Kadubandi Srinivasa Rao
YSRCP

More Telugu News