Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా!

Rakul Preet Singh tested with Corona
  • తనకు కరోనా సోకిందని ప్రకటించిన రకుల్
  • స్వీయ నిర్బంధంలో ఉన్నానని వెల్లడి
  • తనను కలిసిన వారంతా టెస్ట్ చేయించుకోవాలని విన్నపం
టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. కోవిడ్ పరీక్షల్లో తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని రకుల్ తెలిపింది. కరోనా సోకిందని తెలిసిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని చెప్పింది. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, రెస్ట్ తీసుకుంటున్నానని తెలిపింది. త్వరలోనే పూర్తిగా కోలుకుని, షూటింగుల్లో పాల్గొంటానని చెప్పింది.

ఇటీవల తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మరోవైపు, రకుల్ కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Rakul Preet Singh
Tollywood
Bollywood
Corona Virus

More Telugu News