Jagan: జగన్‌ కడప పర్యటన.. మూడు రోజుల షెడ్యూల్ వివరాలు ఇవిగో!

  • రేపు సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరనున్న జగన్
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
  • క్రిస్మస్ రోజున పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు
Jagan Pulivendula tour schedule

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన ఖరారైంది. రేపటి నుంచి 25 వరకు మూడు రోజుల పాటు జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో, ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు.

రేపు సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి కడప విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రేపు రాత్రి ఇడుపులపాయలోనే బస చేస్తారు.

24న ఉదయం 9.10 గంటలకు వైయస్ ఘాట్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 10 గంటల నుంచి 12 గంటల వరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు. మధ్యాహ్నం పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 2.20 గంటలకు ఆర్టీసీ బస్టాండ్, బస్సు డిపోలకు శంకుస్థాపన చేస్తారు. 3.10 గంటల ఇమ్రా ఏపీకి, ఆ తర్వాత అపాచీ లెదర్ డెవలప్ మెంట్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇడుపులపాయకు చేరుకుంటారు.

25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 11.45 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజమండ్రికి బయలుదేరి వెళ్తారు.

More Telugu News