Tulasi Reddy: ఈ రోడ్ల మీద సీఎం ఒక్కసారి ప్రయాణిస్తే ఆయన పాలనపై ఆయనకే అసహ్యం వేస్తుంది: తులసిరెడ్డి

Tulasi Reddy take a dig at CM Jagan over roads conditions in AP
  • రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయన్న తులసిరెడ్డి
  • ఏ రోడ్డు చూసినా గుంతలమయమని వ్యాఖ్యలు
  • గంట ప్రయాణిస్తే వాహనం షెడ్డుకు పోవాల్సిందేనని వెల్లడి
  • గర్భిణీలు ఆసుపత్రికి చేరకముందే ప్రసవిస్తారని వ్యంగ్యం
  • గాల్లో కాకుండా రోడ్లపైనా ప్రయాణించాలని సీఎంకు హితవు

ఏపీ ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సీఎం జగన్ గాల్లో తిరగడం తగ్గించి, అప్పుడప్పుడు రోడ్లపైన కూడా తిరగాలని హితవు పలికారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని, ఏ రోడ్డు చూసినా గుంతలు, చెరువులను తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు.

పులివెందుల-కదిరి-గోరంట్ల-బెంగళూరు రహదారులపై ముఖ్యమంత్రి ఒక్కసారి ప్రయాణిస్తే ఆయన పాలనపై ఆయనకే అసహ్యం వేస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి రోడ్లపై గంట పాటు ప్రయాణిస్తే ఆ వాహనం మరమ్మతుల కోసం షెడ్డుకు పోక తప్పదని అన్నారు. ఒళ్లు గుల్లయిపోయే ఇలాంటి రోడ్లపై ప్రయాణాలు చేస్తే గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి చేరకముందే ప్రసవిస్తారని తెలిపారు.

  • Loading...

More Telugu News