ఢిల్లీ ఎయిర్ పోర్టులో కొత్త కరోనా కలకలం.. లండన్ నుంచి వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్!
- ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్
- బ్రిటీష్ ఎయిర్ వేస్ లో వచ్చిన వారి శాంపిల్స్ సేకరణ
- రేపటి నుంచి అమల్లోకి రానున్న బ్రిటన్ పై ట్రావెల్ బ్యాన్
నిన్న రాత్రి లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి చేరుకున్న 266 మంది ప్రయాణికుల్లో ఐదుగురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఉదయం బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన మరో విమానం ఢిల్లీలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో వచ్చిన ప్రయాణికులందరి శాంపిల్స్ ని సేకరించారు. వీరి శాంపిల్స్ ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఫర్ రీసర్చ్ కి పంపించారు. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఐసొలేషన్ కు పంపుతున్నారు.