కుటుంబీకులు చెప్పారని లొంగిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు... కశ్మీర్ లో అనూహ్య ఘటన!
- కుల్గామ్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం
- ఎన్ కౌంటర్ మొదలు కాగానే లొంగిపోయిన వైనం
- ఫిస్టల్స్, మందుగుండు స్వాధీనం
మరిన్ని వివరాలను అధికారులు వెల్లడిస్తూ, ఇద్దరు ఉగ్రవాదులు కుల్గామ్ సమీపంలోని తొంగుడౌనులో దాగున్నారని తెలుసుకుని పోలీసులు, జవాన్లు ఆ ప్రాంతానికి వెళ్లారని తెలియజేశారు. ఆపై ఎన్ కౌంటర్ జరుగుతుండగా, తమ వారిని లొంగిపోవాలని కుటుంబీకులు కోరారని, దీంతో వారు లొంగిపోయారని అన్నారు. వారి నుంచి ఉగ్రవాద సాహిత్యంతో పాటు రెండు పిస్టల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.