Vara Vara Rao: ఆసుపత్రిలో ఉండేందుకు వరవరరావుకు హైకోర్టు అనుమతి

High court allows Varavara Rao to stay Hospital till January 7th
  • ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్
  • జైలులో ఉండగా క్షీణించిన ఆరోగ్యం
  • కోర్టు జోక్యంతో ఆసుపత్రికి
  • ఆరోగ్యం మెరుగుపడిందన్న వరవరరావు తరపు న్యాయవాది
ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్ట్ అయిన విప్లవకవి, సామాజిక కార్యకర్త వరవరరావు వచ్చే నెల 7 వరకు నానావతి ఆసుపత్రిలో ఉండేందుకు బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. జైలులో ఉన్న 81 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో కోర్టు సూచన మేరకు ఆయనను గత నెలలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలన్న ‘మహా’ ప్రభుత్వం, ఎన్ఐఏల అభ్యర్థనను కోర్టు నిన్న తిరస్కరించింది.

జనవరి ఏడో తేదీ వరకు నానావతి ఆసుపత్రిలో ఉండేందుకు వరవరరావుకు అనుమతిచ్చిన ధర్మాసనం.. బెయిలు పిటిషన్‌ను మాత్రం వచ్చే నెల 7కు వాయిదా వేసింది. అలాగే, వరవరరావుకు ఆరోగ్యానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా జస్టిస్ ఎస్ఎస్ షిండే, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా, వరవరరావు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్టు ఆయన తరపు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ కోర్టుకు తెలిపారు.
Vara Vara Rao
Maoist
Mumbai
Bombay HIgh Court
Elgar Parishad

More Telugu News