Bigg Boss: బిగ్ బాస్ రన్నరప్ అఖిల్ కు టీఆర్ఎస్ నాయకుడి సన్మానం!

TRS Felicitates bigg boss Runnerup Akhil
  • అఖరి మెట్టు వరకూ వెళ్లిన అఖిల్
  • రెండో స్థానంతో సరిపెట్టుకుని ఇంటికి
  • అంతవరకూ వెళ్లడమే అభినందనీయమన్న రేగిళ్ల
టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 4లో ఆఖరి మెట్టు వరకూ వెళ్లి, రెండో స్థానంతో సరిపెట్టుకున్న అఖిల్ ను తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం నాయకుడు సత్కరించారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో టాప్-2లో అభిజిత్, అఖిల్ నిలువగా, చివరకు అభిజిత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆపై కంటెస్టెంట్లు తమ ఇళ్లకు చేరుకోగా, టీఆర్ఎస్ యూత్ నాయకుడు రేగిళ్ల సతీశ్ రెడ్డి, అఖిల్ వద్దకు వెళ్లి సన్మానించారు. ఈ షోలో ఫైనల్ వరకూ వెళ్లి, రన్నరప్ గా నిలవడం అభినందనీయమని అన్నారు. హైదరాబాద్ లోని తన ఇంటికి చేరిన అఖిల్ ను అభినందించేందుకు వందలాది మంది అభిమానులు వచ్చి సందడి చేశారు.
Bigg Boss
Akhil
Finalist
Runnerup

More Telugu News