Mamata Banerjee: కరోనా కారణంగా పౌరసత్వ సవరణ చట్టం మరుగున పడింది: అమిత్ షా

  • సీఏఏ నియమాలు రూపొందించడం భారీ ప్రక్రియ
  • కరోనా వేళ ఇప్పుడది సాధ్యం కాదు
  • మమతపై తీవ్ర విమర్శలు
Now it is not right time to implement CAA

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కరోనా కారణంగా మరుగున పడిందని, దేశంలో టీకా పంపిణీ ఒకసారి మొదలు కాగానే దాని సంగతి చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ చట్టానికి సంబంధించిన నియమాలను రూపొందించడం ఓ భారీ ప్రక్రియ అని, ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కొనసాగించడం కష్టమన్నారు. వ్యాక్సిన్ పంపిణీ అందుబాటులోకి వచ్చి కరోనాను ఖతం చేసిన తర్వాత మాత్రమే సీఏఏపై దృష్టి సారిస్తామన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడిని ఖండించిన షా, ఈ ఘటనకు మమత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బెంగాల్ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలన్న కేంద్రం లేఖను మమత తీవ్రంగా తప్పుబట్టడంపై స్పందించిన షా, ఐపీఎస్ అధికారులను ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందన్నారు. ఈ విషయంలో రాష్ట్రానికి లేఖ రాయడం చట్టబద్దమేనని షా తేల్చి చెప్పారు.

More Telugu News